మన సినిమాల్లో శివయ్య
on Mar 7, 2016

మహా శివుడు భక్త శుభంకరుడు, భోళా శంకరుడు, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఆ మహేశ్వరుడు. ఆయన కరుణ కోసమే అందరి చూపులు. అందుకు మన తెలుగు సినిమాలు మినహాయింపు కాదు. అనేక సినిమాల్లో శంకరుడి పాత్రతో భక్తులను పరశింపచేయడానికి ప్రయత్నించారు. మహాశివరాత్రి సందర్భంగా మన తెలుగు తెరపై శివుళ్లు ఎవరో చూద్దాం రండి.
తెలుగు తెరపై తొలి శివుడు 1935లో కనబడ్డాడు. దాసరి కోటిరత్నం నిర్మించిన సతీ అనసూయ లో శివుడి పాత్ర ఉంది. అయితే ఆ పాత్ర ఎవరు చేశారనేది మాత్రం పెద్దగా తెలియలేదు

భక్తుడి ప్రేమను అర్ధం చేసుకున్న భక్త సులభుడి కథ. ఈ సినిమాలో పరమశివునిగా ఎం.బాలయ్య నటించారు. కన్నప్పగా కృష్ణంరాజు జీవించారు

దక్షయజ్ఞంలో ఎన్టీఆర్ చేసిన శివుని పాత్ర నభూతో నభవిష్యతి. క్లైమాక్స్ లో శివుని రుద్రతాండవం చూస్తే, రోమాలు నిక్కబొడవాల్సిందే. ఉమాచండీ గౌరీశంకరుల కథ సినిమాలో కూడా ఎన్టీఆర్ శివుడిగా మెప్పించారు.

మాస్ హీరో అయ్యుండి, పరమశివుని పాత్రను పోషించడం చిన్న విషయం కాదు. ఈ విషయంలో చిరును ఎవరూ కొట్టలేరేమో. కెరీర్ మంచి పీక్ లో ఉన్న టైంలో కూడా మంజునాథలో పరమశివునిగా అద్భుతనటనను కనబర్చారు. అంతకు ముందు ఆపద్బాంధవుడు, పార్వతీ పరమేశ్వరులు సినిమాల్లో శివుడి పాత్ర వేసుకున్నారు మెగాస్టార్

నాగార్జున హీరోగా వచ్చిన ఢమరుకం సినిమా కూడా శివనేపథ్యమే. నాస్తికుడిగా నాగార్జున, శివుడిగా ప్రకాష్ రాజ్ నటించారు.

ఇప్పుడున్న హీరోల్లో, శివుడి పాత్ర అద్భుతంగా సెట్ అయ్యేది ప్రభాస్ కే అనేది సినీజనాల మాట. మిగిలిన హీరోల్లో ఎంత మందికి మహాశివుని పాత్ర సరిపోతుందో పక్కన పెడితే, వారిలో ఆ పాత్రను రక్తి కట్టించగలిగేవారెందరుంటారో చెప్పడం కష్టమే. పౌర్ణమి సినిమాలో క్లైమాక్స్ సాంగ్ లో, శివుడి పాట వస్తున్నప్పుడు, రౌడీలతో ఫైటింగ్ చేస్తాడు ప్రభాస్. ఇక బాహుబలి సినిమాలో లింగాన్ని మోస్తూ, శివుడు అనే పేరుతో పాత్రలో జీవించాడు. త్వరలోనే భక్త కన్నప్పతోనో, లేక మరో సినిమాలోనో శివుడి పాత్రధారిగా ప్రభాస్ వస్తే ఆశ్చర్యం లేదు.
అందరికీ పరమశివుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



