నాని కొత్త సినిమా ప్రకటన.. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్!
on Dec 30, 2022

ఈ ఏడాది 'అంటే సుందరానికి' చిత్రంతో అలరించిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'దసరా' చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా నాని తదుపరి చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
నాని తదుపరి చిత్రం వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందనుంది. ఈ మూవీ ఇతర వివరాలను రివీల్ చేస్తూ జనవరి 1న సాయంత్రం 4:05 కి అనౌన్స్ మెంట్ రానుంది. ఈ చిత్రంతో శౌర్య దర్శకుడిగా పరిచయం కానున్నాడని తెలుస్తోంది. అలాగే 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రానికి.. మలయాళ ఫిల్మ్ 'హృదయం' ఫేమ్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించనున్నాడని సమాచారం.

ఇప్పటికే ఓ కొత్త దర్శకుడితో 'దసరా' చేస్తున్న నాని మరో కొత్త దర్శకుడికి అవకాశమివ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక నాని సరసన మృణాల్ ఠాకూర్ నటించనుందనే వార్త కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



