నాని బేనర్‌పై విష్వక్ సేన్ హీరోగా 'హిట్'
on Oct 24, 2019
వాల్ పోస్టర్ సినిమా బేనర్‌పై తొలిగా 'అ!' అనే ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు హీరో నాని. ఆ మూవీతో ప్రశాంత్ వర్మ డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. ఆ మూవీకి రెండు జాతీయ అవార్డులు లభించాయి. ఒకటి - స్పెషల్ ఎఫెక్ట్స్‌లో, మరొకటి - మేకప్‌లో. ఆ మూవీ తర్వాత నిర్మాతగా రెండో సినిమాని గురువారం లాంచ్ చేశాడు నాని. 'ఫలక్‌నుమా దాస్'గా ఆకట్టుకున్న విష్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పేరు 'హిట్'. 'చి.ల.సౌ' ఫేం రుహానీ శర్మ హీరోయిన్గా నటించే ఈ సినిమా ద్వారా శైలేష్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు.
ఈ మూవీ నిర్మాణ పనులు గురువారం మొదలయ్యాయి. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నాని క్లాప్ కొట్టారు. నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్. మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి పనిచేసే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.