ఎప్పుడొస్తావ్ 'గ్యాంగ్ లీడర్'?
on Jul 31, 2019
కొట్టేశారు... 'గ్యాంగ్ లీడర్' చిత్రానికి గుమ్మడికాయ కొట్టేశారు. దర్శకుడు విక్రమ్ కె. కుమార్ చిత్రీకరణ అంతా పూర్తి చేశారు. నిజానికి... సోమవారమే హీరో నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్ పాత్రలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. మంగళవారం మిగతా ఆర్టిస్టులకు చెందిన షూటింగ్ కూడా పూర్తి చేశారు. ప్యాచ్ వర్క్ అవసరం అయితే తర్వాత రెండు మూడు రోజులు చేస్తారు. షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్ పూర్తయింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్వశ్చన్? 'గ్యాంగ్ లీడర్' ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తాడు? అనేది క్లారిటీ లేదు. ముందుగా అయితే ఆగస్టు 30న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. 'సాహో' సేమ్ డేట్ మీద కర్చీఫ్ వేయడంతో ప్లాన్ పక్కకు వెళ్లింది. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన టీజర్ లో రిలీజ్ డేట్ వేయలేదు. ఎందుకైనా మంచిదని వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ 'సాహో' మళ్లీ వాయిదా పడితే ఆగస్టు 30న 'గ్యాంగ్ లీడర్' వస్తాడు. లేదంటే కొత్త డేట్ చూసుకోవాలి.