'గ్యాంగ్ లీడర్'లో రైటర్ vs రేసర్
on Aug 26, 2019
'నానిస్ గ్యాంగ్ లీడర్'లో 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ ఫార్ములా వన్ కార్ రేసర్‌గా నటిస్తున్నట్టు గతంలో తెలుగువన్ చెప్పింది. ఈ విషయాన్ని నాని కన్ఫర్మ్ చేశారు. 'కార్తికేయ రేసర్‌గా నటిస్తున్నాడా?' అని నానిని అడిగితే... 'అటువంటిదే' అని చెప్పారు. ఈ సినిమాలో రివేంజ్ సినిమా రైటర్ పెన్సిల్ పార్ధసారథి పాత్రలో నాని నటిస్తున్న సంగతి తెలిసిందే. 'గ్యాంగ్ లీడర్'లో రేసర్‌కి రైటర్‌కి ఫైట్స్ ఉన్నాయా? అని అడిగితే... 'ఆగస్టు 28న విడుదల అవుతున్న ట్రైలర్ లో చూస్తారుగా' అని నాని చెప్పారు. ఆదివారం రాత్రి నాని ఫారిన్ వెళ్లారు. అంతకు ముందు హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సినిమాలో హీరోయిన్ ప్రియాంకను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ నెల 28న ట్రైలర్, సెప్టెంబర్ తొలి వారంలో ప్రమోషనల్ వీడియో సాంగ్ విడుదల చేస్తున్నట్టు నాని తెలిపారు. విలన్ దేవ్ పాత్రలో కార్తికేయ అద్భుతంగా నటించాడని ప్రశంసించారు. తమది కుటుంబమంతా కలిసి చూసే కామెడీ సినిమా అని నాని అన్నారు. తన పాత్ర ప్రేక్షకులను భయపెట్టేలా ఉంటుందని, కథ విన్న రెండు సెకన్లలో ఓకే చెప్పేశానని కార్తికేయ తెలిపారు.