నందమూరి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టేనా?
on Sep 7, 2022

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఆశ అంత ఈజీగా నెరవేరేలా లేదు. ఇప్పట్లో మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఎన్నోసార్లు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. 'ఆదిత్య 999'తో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందని భావించగా అదసలు కార్యరూపం దాల్చలేదు. అదే సమయంలో మోక్షజ్ఞ బొద్దుగా ఉన్న ఫోటోలు దర్శనమివ్వడం, మోక్షజ్ఞకు అసలు సినిమాలపై ఆసక్తి లేదన్న వార్తలు రావడంతో నందమూరి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అయితే ఇటీవల మళ్ళీ మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి కొన్ని న్యూస్ చక్కర్లు కొట్టాయి. త్వరలోనే మోక్షజ్ఞ మొదటి సినిమా మొదలవుతుందని, ప్రస్తుతం అతను నటనలో శిక్షణ తీసుకోవడంతో పాటు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కసరత్తులు చేస్తున్నాడని వార్తలొచ్చాయి. అంతేకాదు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్టర్ ఇతనేనంటూ కొన్ని పేర్లు కూడా వినిపించాయి. అయితే నిన్న విడుదలైన మోక్షజ్ఞ బర్త్ డే ఫోటోల దెబ్బకి ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సెట్స్ లో మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోలు చూసి నందమూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే ఆ ఫోటోలలో మోక్షజ్ఞ చాలా బొద్దుగా కనిపిస్తున్నాడు. అతను హీరో అవ్వడానికి కసరత్తులు చేస్తున్నట్టు ఒక్క శాతం కూడా అనిపించట్లేదు. ఐదేళ్ళ క్రితం మోక్షజ్ఞ ఫేసులో చాలా గ్లో ఉండేది, బాడీ పరంగా కూడా కరెక్ట్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు ముఖంలో మునుపటి కళ లేదు. బాడీ పరంగా కూడా ఏమాత్రం శ్రద్ధ తీసుకుంటున్నట్లు కనిపించట్లేదు. మరి మోక్షజ్ఞకు నిజంగానే సినిమాలపై ఆసక్తి లేదా? లేక సడెన్ గా తనని తాను మార్చుకొని సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



