ఆకట్టుకుంటున్న 'స్వాతిముత్యం' సెకండ్ సింగిల్
on Sep 7, 2022

బెల్లంకొండ గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో లక్ష్మణ్.కె.కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'నీ చారెడు కళ్లే'కి సూపర్ రెస్పాన్స్ రాగా.. తాజాగా సెకండ్ సింగిల్ ని విడుదల చేశారు మేకర్స్.
'స్వాతిముత్యం' నుంచి 'డుం డుం డుం' అంటూ సాగే రెండో పాటను తాజాగా విడుదల చేశారు. మహతి స్వరపరిచిన ఈ మెలోడీ ఆకట్టుకుంటోంది. నిశ్చితార్థం నుండి పెళ్లి వరకు జరిగే తంతుని ఈ లిరికల్ వీడియోలో చక్కగా చూపించారు. మహతి బ్యూటిఫుల్ మ్యూజిక్ కి సూర్య విజువల్స్ మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఈ సాంగ్ కి కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఆదిత్య, అరుణ్, లోకేష్ ఆలపించారు.

'స్వాతిముత్యం' దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రంగా వస్తున్న 'స్వాతిముత్యం' ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



