బాలయ్య బర్త్ డే పార్టీలో హంసానందినితో డాన్స్..!
on May 22, 2016
.jpg)
నందమూరి నటసింహం బాలయ్య పుట్టినరోజంటే అభిమానులకు పండుగ రోజు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా రక్తదానాలు, అన్నదానాలు ఏర్పాటు చేసి బాలయ్య మీద తమకున్న అభిమానాన్ని చాటుకుంటారు. అయితే అందరిలా ఆలోచిస్తే కిక్కేముంది అనుకున్న కొంతమంది అభిమానులు వెరైటిగా ప్లాన్ చేశారు. జూన్ 10న అమెరికాలో నివసిస్తున్న బాలకృష్ణ అభిమానులు ఆయన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నారు. అందుకోసం ఐటెం సాంగ్స్‌తో ఫుల్ పాపులర్ అయిన హంసానందినితో డాన్స్ షో ఏర్పాటు చేశారని సమాచారం. కాలిఫోర్నియాలో ఈ పార్టీ జరగనుంది..ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన డబ్బును బసవతారకం కాన్సర్ హస్పటిల్‌కు ఇవ్వనున్నారు. ఈ పార్టీకి బాలకృష్ణను ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పార్టీలోనే తన 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్‌లుక్‌ని బాలయ్య రిలీజ్ చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



