ఐటెం సాంగ్‌లో దీపికా..!
on May 22, 2016
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఐటెం సాంగ్‌లో తళుక్కుమని మెరవనుంది. ట్రిపులెక్స్ అనే చిత్రం ద్వారా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేసింది. ప్రజంట్ కాస్త గ్యాప్ దొరకడంతో ఐటెం సాంగ్‌లో నటించేందుకు దీపిక అంగీకరించినట్లు సమాచారం. 2011లో దమ్ మారో దమ్‌లో చివరి సారిగా ఐటెం సాంగ్‌లో నటించారు. తాజాగా సుషాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతిసనన్ జంటగా నటిస్తున్న రాబ్తా మూవీలో ఐటెం సాంగ్ కోసం దీపికను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీటౌన్ టాక్.