Home

»

Latest News

త్రివిక్ర‌మ్ తో మ‌రో హ్యాట్రిక్ కి స్కెచ్!

Jan 27, 2022 2:21PM

తెలుగునాట స‌క్సెస్ రేట్ ఎక్కువ ఉన్న ద‌ర్శ‌కుల్లో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఒక‌రు. ఇప్ప‌టివ‌ర‌కు 11 చిత్రాల‌ను త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేయ‌గా.. వాటిలో కేవ‌లం రెండు సినిమాలు మాత్ర‌మే బాక్సాఫీస్ ముంగిట బోల్తా ప‌డ్డాయి.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఖాతాలో ఉన్న తొమ్మిది విజ‌యాల్లో 5 సినిమాల‌ను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించింది. ఆ సంస్థ‌నే.. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్. ఈ ప్రొడ‌క్ష‌న్ హౌస్ కాంబినేష‌న్ లో త్రివిక్ర‌మ్ ఇప్ప‌టివ‌ర‌కు `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి`, `అ ఆ`, `అజ్ఞాత‌వాసి`, `అర‌వింద స‌మేత‌`, `అల వైకుంఠ‌పుర‌ములో` వంటి ఆరు చిత్రాలు చేయ‌గా.. ఒక్క `అజ్ఞాత‌వాసి` మాత్ర‌మే డిజ‌ప్పాయింట్ చేసింది. `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి`, `అ ఆ`తో ఈ సంస్థ‌లో హ్యాట్రిక్ అందుకున్నారు త్రివిక్ర‌మ్.

క‌ట్ చేస్తే.. `అర‌వింద స‌మేత‌`, `అల వైకుంఠ‌పుర‌ములో` వంటి మ‌ళ్ళీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అనంత‌రం ఇదే సంస్థ‌లో త‌న తదుప‌రి చిత్రం తీయ‌బోతున్నారు త్రివిక్ర‌మ్. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబినేష‌న్ లో చేయ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. 2023 సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా నిర్మాణం జ‌రుపుకోనుంద‌ని బ‌జ్. మ‌రి.. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ తో హ్యాట్రిక్ విజ‌యాలు చూసిన హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌.. `అర‌వింద స‌మేత‌`, `అల వైకుంఠ‌పుర‌ములో` త‌రువాత రాబోతున్న `#SSMB 28`తోనూ స‌క్సెస్ చూసి ఇంకో హ్యాట్రిక్ అందుకుంటుందేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com