సామ్‌ను కలవనున్న నాగ్.. చైతూ కూడా వెళ్తాడా?
on Nov 2, 2022

టాప్ యాక్ట్రెస్ సమంత రూత్ ప్రభు తాను ఆటో ఇమ్యూన్ డిసీజ్ మైయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది. నిష్కపటంగా ఆమె చేసిన పోస్ట్ ఇండస్ట్రీలోని చాలా మంది స్నేహితులు సహనటులనుఆందోళనకు గురి చేసింది. సౌత్ స్టార్స్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, తమన్నా, నాని, సాయి పల్లవి లాంటి వాళ్లందరూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కానీ ఆమె మాజీ భర్త కానీ, మాజీ అత్తమామలు కానీ ఆమె ఆరోగ్య పరిస్థితిపై బహిరంగంగా స్పందించలేదు.
అయితే, వస్తున్న రిపోర్టుల ప్రకారం, సీనియర్ స్టార్ నాగార్జున అక్కినేని తన మాజీ కోడలు ఆరోగ్యాన్ని ఆరా తీసేందుకు ఆమెను పరామర్శించాలని యోచిస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున రెండో కొడుకు అఖిల్ అక్కినేని ఒక్కడే సోషల్ మీడియాలో స్పందించాడు.
సమంతతో నాగ్‌కు సన్నిహిత అనుబంధం ఉంది. అందుకే ఆమెను కలుసుకోవాలని నాగ్ అనుకుంటున్నట్లు సమాచారం. అభిమానులు సామ్ అని ముద్దుగా పిలుచుకొనే సమంత, నాగ చైతన్య గత ఏడాది అక్టోబర్‌లో తమ నాలుగేళ్ల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పారు.
కాగా, తన తండ్రితో పాటు చైతూ కూడా సమంతను కలవడానికి వస్తాడా అనేది అస్పష్టం. నవంబర్ 11న విడుదలవుతున్న తన చిత్రం 'యశోద'ను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్న సామ్, రీసెంట్‌గా తన ఆరోగ్య స్థితిని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు ఆమె తెలిపింది. ఇది సాధారణంగా రోగనిరోధక వ్యవస్థలో సమస్య వల్ల తలెత్తుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



