వీజే సన్నీ, సప్తగిరి 'అన్ స్టాపబుల్' టీజర్ రిలీజ్!
on Dec 28, 2022
.webp)
బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా వస్తున్న మూవీ "అన్ స్టాపబుల్" సన్నీకి జోడీగా నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించారు. ‘పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం ఆడోరకం’ వంటి చిత్రాలకు రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టీజర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు.
'అన్ లిమిటెడ్ ఫన్' అనేది దీని టాగ్ లైన్. ఇటివలే నిర్మాత దిల్ రాజు విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. కింగ్ నాగార్జున 'అన్ స్టాపబుల్' టీజర్‌ను విడుదల చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే.. "ట్విస్టులకే టీషర్టు వేసినట్లుండే ఇద్దరు ఇలఖత మఫిలియా గురించి మీకు చెప్తా" అంటూ 30 ఇయర్స్ పృథ్వీ వాయిస్ ఓవర్ తో స్టార్టైన ఈ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.
ఫేమస్ కమెడియన్స్ బిత్తిరి సత్తి, షకలక శంకర్, రఘుబాబు పాత్రలు మస్త్ ఫన్ అందించేలా డిజైన్ చేశారు. ఇక బిందుమాధవి, సోహెల్ , వరుణ్ సందేశ్, మానస్ నాగులపల్లి, ఆర్జే కాజల్, యాంకర్ రవి, అనిల్ రాథోడ్, నేహా చౌదరి, శ్వేతా వర్మ ఇలా ఎందరో సన్నీకి విషెస్ చెప్పారు. ఇటీవల ధమాకా వంటి చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించిన భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



