తల్లి అంజనాదేవి ఆరోగ్యంపై స్పందించిన నాగబాబు!
on Jun 24, 2025
మెగా మదర్ అంజనాదేవి అనారోగ్యం పాలైనట్లు ఈరోజు ఉదయం వార్తలొచ్చాయి. ఆమె అస్వస్థకు గురయ్యారన్న సమాచారంతో.. ఏపీ క్యాబినెట్ మీటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్ళిపోయారని కూడా న్యూస్ వినిపించింది. దీంతో మెగా అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు.
అయితే తన తల్లి అంజనాదేవి అనారోగ్యం పాలైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తాజాగా నాగబాబు అన్నారు. "అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. ఆమె ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం ప్రచారం జరుగుతోంది. ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారు." అని నాగబాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అంజనాదేవి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నాగబాబు ట్వీట్ చేయడంతో.. మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం కూడా అంజనాదేవి అనారోగ్యం పాలైనట్లు వార్తలొచ్చాయి. కానీ, ఆ వార్తలను మెగా కుటుంబం ఖండించింది. రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలిపింది. ఇప్పుడు మరోసారి అంజనాదేవి ఆరోగ్యం గురించి వార్తలు రాగా, మళ్ళీ మెగా ఫ్యామిలీ ఖండించింది. మరోవైపు అంజనాదేవి ఆరోగ్యం గురించి తరచూ ఇలా ఫేక్ వార్తలు వస్తుండటం పట్ల మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
