Home

»

Latest News

‘జైలర్ 2’ రైట్స్ 90 కోట్లా: నాగవంశీ రిస్క్ వెనుక ఉన్న అసలు నిజమిదే.!

Sep 26, 2026 11:44AM

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న వేళ.. ఈ మూవీ తెలుగు రైట్స్ డీల్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నిర్మాత నాగవంశీ ఈ సినిమాను ఎంతకు దక్కించుకున్నారనే విషయంలో భిన్నమైన వార్తలు వచ్చాయి.

‘జైలర్ 2’ తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని ఏరియాల రైట్స్ కలిపి నాగవంశీ ఏకంగా రూ.90 కోట్లకు తీసుకున్నారనే ప్రచారం ఇటీవల కనిపించింది. అయితే ఇందులో అసలు విషయం వేరే ఉందని తెలుస్తోంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం నాగవంశీ సొంతం చేసుకున్నది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ మాత్రమే. ఈ డీల్ విలువ సుమారు రూ.45 కోట్లు + GSTగా చెబుతున్నారు. అంటే రూ.90 కోట్లకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ఏరియాల రైట్స్ తీసుకున్నారనే వార్తలో వాస్తవం లేదన్నమాట.

నిజానికి ‘జైలర్ 2’ తెలుగు రైట్స్ కోసం కొంతకాలంగా మంచి పోటీనే కనిపించింది. సన్ పిక్చర్స్ తొలుత తెలుగు రాష్ట్రాల హక్కులకు సుమారు రూ.55 కోట్లు + GST కోట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. చివరకు రూ.45 కోట్లు + GST డీల్‌కు రైట్స్ క్లోజ్ అయినట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి.

ఇక ఈ డీల్ వెనుక ‘జైలర్’ మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లో సాధించిన బిజినెస్ కూడా కీలకంగా మారింది. రజనీకాంత్ ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్‌గా చేసిన ఆ సినిమా తెలుగులో కూడా మంచి వసూళ్లు రాబట్టడంతో.. సీక్వెల్‌పై ట్రేడ్‌లో మొదటి నుంచే ఆసక్తి కనిపించింది.

ఇది కూడా చదవండి: బాస్ తొక్కేశాడు.. ట్రోల్స్ చిరంజీవి వరకు వెళ్ళాయిగా.!

ఇప్పుడు ‘జైలర్ 2’ను నెల్సన్ దిలీప్‌కుమార్ మరోసారి తెరకెక్కించగా.. రజనీకాంత్‌తో పాటు విద్యాబాలన్, ఎస్.జే. సూర్య, సూరజ్ వెంజరమూడ్ వంటి నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ‘జైలర్ 2’ను విడుదల కానుంది. దసరా సీజన్‌లో వస్తున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రైట్స్ రూ.45 కోట్ల డీల్‌కు క్లోజ్ కావడంతో.. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి థియేట్రికల్ రిజల్ట్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

 

 

 

[Jailer 2 Telugu Rights, Producer Naga Vamsi, Jailer 2 Telugu Release, Rajinikanth, Nelson Dilipkumar, Vidya Balan, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com