
తనపై వచ్చే ట్రోల్స్ ను స్పోర్టివ్ గా తీసుకుంటారని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు. ఇటీవల కొందరు పనిగట్టుకొని సోషల్ మీడియా వేదికగా చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. ఏదైనా సినిమా ఫ్లాప్ అయినా, ఎవరైనా హీరో సినిమా లేట్ అయినా.. చిరంజీవే కారణమంటూ, "బాస్ తొక్కేశాడు" అంటూ అర్థంపర్థంలేని పోస్టులు పెడుతున్నారు. వేరే ఎవరి మీదైనా ఈ తరహా పోస్టులు వస్తే.. ఫైర్ అవుతారేమో. కానీ, అక్కడున్నది చిరంజీవి కదా.. ఆ ట్రోల్స్ ని కూడా సరదాగా తీసుకున్నారు. పైగా, వాటికి తనదైన శైలిలో కౌంటర్ కూడా ఇచ్చారు.
తాజాగా 'సిగ్మా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. చిరంజీవి మాట్లాడుతూ.. "నువ్వు విశ్వంభరలో నటించాల్సింది కానీ, ఎందుకనో మిస్ అయింది. నువ్వు నా సినిమా రిజెక్ట్ చేశావా" అని ఫరియాను అడిగారు. దానికి షాకైపోయిన ఫరియా.. నేను మీ సినిమా రిజెక్ట్ చేయడం ఏంటని చెప్పింది. ఆ వెంటనే చిరంజీవి కౌంటర్ ఇస్తూ.. "ఏమో నన్ను తొక్కేస్తున్నావు అనుకున్నా" అనగానే ఆ వేడుక అభిమానుల కేరింతలతో దద్దరిల్లింది.
ఇది కూడా చదవండి: గంటకు 17 వేల టికెట్లు.. నెగటివ్ టాక్‌ను తట్టుకొని 'ప్యారడైజ్' మాస్ విధ్వంసం
[Chiranjeevi Counter To Trolls, Megastar Chiranjeevi Speech, SIGMA Pre Release Event, Chiranjeevi Sigma Event, Boss Thokkesadu, Chiranjeevi, Faria Abdullah, Telugu Film News, Telugu News]






