Home

»

Latest News

దేవతలతో పెట్టుకోకండి: దమ్ము ధైర్యం ఉండాలి: 'ది ప్యారడైజ్'పై వేణు స్వామి సంచలన కామెంట్స్

Sep 26, 2026 12:04PM

 

 

జడల్ ఉరఫ్ 'నాని' చాలా నాచురల్ గా రెండు రోజులకే వంద కోట్ల క్లబ్ లో చేరాడు. అలాంటి ఈ టైంలో ప్రముఖ వివాదాస్పద  జ్యోతిష్యుడు గా సోషల్ మీడియాలో చెప్పబడుతున్న వేణు స్వామి 'ప్యారడైజ్' పై చేసిన  వ్యాఖ్యలు  వైరల్ అవుతున్నాయి. 


ఆయన మాట్లాడుతు 'ఒక కీలకమైన పోరాట సన్నివేశంలో ధూమావతి అమ్మవారి స్వరూపాన్ని, అమ్మవారి వాహనమైన కాకి సంకేతాన్ని అత్యంత ప్రభావవంతంగా చూపించారు. ఒక యాక్షన్ సీన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో అమ్మవారి మూల మంత్రాన్ని ఒక శక్తివంతమైన ఆరా రూపంలో ధ్వనించేలా చేయడం నన్ను  ఎంతగానో ఆశ్చర్యపరిచింది  తాంత్రిక సంప్రదాయంలో అత్యంత క్లిష్టమైన, ఉగ్రరూప శక్తులకి  నిలయమైన ధూమావతి అమ్మవారి సబ్జెక్ట్‌ని ముట్టుకోవాలన్నా, తెరపై అంత పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించాలన్నా దర్శక నిర్మాతలకి ఎంతో దమ్ము, గుండెధైర్యం ఉండాలి. సరైన అవగాహన, ఆధ్యాత్మిక నియమాలు, తాంత్రిక పద్ధతులు తెలియకుండా ఇలాంటి ఉగ్రదేవతల శక్తులతో లేదా మంత్రాలతో పెట్టుకుంటే తీవ్రమైన ప్రతికూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కేవలం వినోదం లేదా సినిమా నేపథ్య సంగీతం కోసం మంత్రాలను ఆవాహన చేసేటప్పుడు వాటి వెనుక ఉన్న పవిత్రతను, తీవ్రతను అర్థం చేసుకోవాలని సూచించారు. అయినప్పటికీ, సినిమాలో ఆ శక్తులను నెగెటివ్ కోణంలో కాకుండా ఆధ్యాత్మికంగా ఎలివేట్ చేసిన తీరు అద్భుతంగా ఉందంటూ శ్రీకాంత్ ఓదెల టేకింగ్‌ను అభినందించారు. 

 


ఇది కూడా చదవండి: ముఖానికి 20 కుట్లు,సర్జరీ: కట్ చేస్తే ఆరు రోజులకే షూటింగ్ లో పాల్గొన్న హీరోయిన్  


గత కొంతకాలంగా సెలబ్రిటీల జాతకాలపై మాట్లాడి వార్తల్లో నిలిచిన వేణు స్వామి, చాలా రోజుల తర్వాత ఒక సినిమాలోని ఆధ్యాత్మిక రహస్యాలపై మాట్లాడటంతో నెటిజన్లు కూడా 'ది ప్యారడైజ్' లోని ధూమావతి అమ్మవారి సీన్ల గురించి చెప్పడంతో ఆ దేవత గురించి సెర్చ్ చేస్తూ గూగుల్ కి మంచి అవకాశం కల్పించారు.     

 

[Dhumavati Goddess Paradise, Nani, Venu Swamy About The Paradise Movie, The Paradise Movie Review, Nani, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com