
సినిమాకి, అభిమానులకి, ప్రేక్షకులకి దొరికిన అరుదైన వరం హీరోయిన్. మన మనసులో, శరీరంలో ఎన్ని బాధలు ఉన్నా సెల్యులాయిడ్ పై హీరోయిన్ పంచే స్వచ్ఛతకి ఫిదా అయిపోతాం. మెస్మరైజ్ చేసే దేవకన్య కూడా. ఈ మాటలన్నీ అక్షరాలా నిజమని మీరే అంటారు.
తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం 'మండాడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయోత్సవంలో మునిగి తేలుతోంది. సూరితో పాటు తెలుగు నటుడు సుహాస్ హీరోలుగా చేయగా, వాళ్ళకి ధీటుగా పెర్ఫార్మ్ చేసి మెప్పించిన భామ 'మహిమా నంబియార్'. ఆమె నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ విజయం వెనుక మహిమా నంబియార్ చూపించిన సాహసవంతమైన అంకితభావం, వృత్తిపట్ల ఆమెకున్న నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరిచాయి. చిత్రంలో ఎంతో కీలకమైన 'ఉసురే నీదాన్ పుల్లా' అనే హిట్ పాట చిత్రీకరణకు కేవలం 5 రోజుల ముందు మహిమా నంబియార్ ఒక తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యింది ఈ ప్రమాదంలో ఆమె ముఖం తీవ్రంగా దెబ్బతిని, ముఖ భాగం పూర్తిగా కొలాప్స్ అవ్వడంతో ఆమె ముఖానికి వైద్యులు 20కి పైగా కుట్లు వేయాల్సి వచ్చింది. వెంటనే ప్లాస్టిక్ సర్జరీ కూడా నిర్వహించారు. ప్రమాదం జరిగిన వెంటనే మహిమా తన పరిస్థితికి సంబంధించిన ఒక సెల్ఫీని దర్శకుడికి పంపగా, అది చూసి ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఇది కూడా చదవండి: 100 కోట్ల క్లబ్ లో ది ప్యారడైజ్: సెకండ్ డే టాక్ ఇదేనా!

షూటింగ్ షెడ్యూల్స్ ముందే నిర్ణయమై ఉండటంతో మహిమా నంబియార్ ఏమాత్రం వెనుకాడకుండా, ప్లాస్టిక్ సర్జరీ జరిగిన కేవలం 6 రోజుల వ్యవధిలోనే తిరిగి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు. అంతటి తీవ్రమైన శారీరక వేదన, నొప్పులు ఉన్నప్పటికీ నవ్వుతూ ఆ సాంగ్ షూటింగ్‌ని పూర్తి చేశారు. ఆమె చూపించిన ఈ అసాధారణమైన ధైర్యం, డెడికేషన్ సినిమా విజయంలో అత్యంత కీలకమైన రోల్ పోషించాయి. అందుకే హీరోయిన్ అంటే సినిమా కోసం ఎంత బాధలని అయినా ఓర్చుకునే ఒరిజినల్ దేవకన్య.
[Mahima Nambiar Accident Mandaadi Shooting Story, Mahima Nambiar, Mahima Nambiar accident,Mandaadi success, Suhaas, Soori, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






