ఐదు చిత్రాలను టార్గెట్ చేసిన నాగశౌర్య
on Jan 22, 2021

జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న యువ కథానాయకుల్లో నాగశౌర్య ఒకరు. ఛలో తరువాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం ఆరు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ఐదు సినిమాలు ఈ ఏడాదిలోనే తెరపైకి రానుండడం విశేషం.
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి.. సంతోష్ జాగర్లమూడి డైరెక్షన్ లో లక్ష్య, కేపీ రాజేంద్ర కాంబినేషన్ లో పోలీస్ వారి హెచ్చరిక, లక్ష్మీ సౌజన్య నిర్దేశకత్వంలో వరుడు కావలెనుతో పాటు శ్రీమాన్, అనీష్ కృష్ణ కాంబినేషన్ లోనూ సినిమాలు చేస్తున్నాడు శౌర్య.
ఈ అరడజను చిత్రాల్లో అనీష్ కృష్ణ కాంబినేషన్ మూవీ మినహా మిగిలిన అన్ని సినిమాలు కూడా ఈ క్యాలెండర్ ఇయర్ నే టార్గెట్ చేసుకున్నాయని టాక్. మరి.. వేర్వేరు జోనర్స్ లో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ హీరో.. ఆయా చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటాడేమో చూడాలి.
అన్నట్టు.. నేడు (శుక్రవారం) నాగశౌర్య పుట్టినరోజు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



