అనంత్ శ్రీరామ్-నాగశౌర్య మధ్య మాటల యుద్ధం!
on Jun 8, 2023
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య మూవీ "రంగబలి" త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ ని చేయడం మొదలు పెట్టింది మూవీ టీం. ప్రముఖ లిరిసిస్ట్ అనంతశ్రీరామ్ తో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అనంతశ్రీరామ్ ఈ మూవీలో నటించడంతో పాటు కొన్ని పాటలు కూడా రాశారు. కానీ ఈ ఇంటర్వ్యూలో హీరో నాగశౌర్య అనంత శ్రీరామ్ కి మధ్య మాటల యుద్ధం మంచి ఘాటుగా జరిగింది. "ఇంటర్వ్యూకి అని పిలిచి మీకు మీరే మాట్లాడుకుంటున్నారు, పొగుడుకుంటున్నారు..అంటే సినిమా సక్సెస్ లో లిరిక్ రైటర్ అనే వాడికి భాగమే లేదా" అంటూ మూవీ టీంతో వాదనకు దిగాడు. దీంతో మూవీటీం అతనికి సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. "లిరిసిస్ట్ కి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి...సినిమా సాంగ్ కావాలంటే పగలు రాత్రి కూర్చుని రాసి ఇచ్చేయాలి. వన్స్ అది రికార్డింగ్ అయ్యిందంటే ఇక లిరిక్ రైటర్ పేరుని ఎవరూ చెప్పరు. ఎన్నో పాటలు మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి మూవీ బిజినెస్ కి ఎంత ప్లస్ అయ్యిందో తెలీదా మీకు" అంటూ టీం మీద ఫైర్ అయ్యారు అనంత శ్రీరామ్.
మధ్యలో నాగశౌర్య వచ్చి ‘‘సర్ మీరు నా మూవీలో "ఏం సందేహం లేదు" అనే పాట రాశారు. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ పాటకి మొత్తం 7 అవార్డులు వచ్చాయి. ఒక్కదానికైనా నన్ను పిలిచారా ? తీసుకుంది మీరే కదా. మమ్మల్ని పిలిచారా ? అప్పుడు మేమేమన్నా హర్ట్ అయ్యామా ? చెప్పండి. సినిమాలో యాక్ట్ చేసింది నేను. డైరెక్ట్ చేసింది అవసరాలు శ్రీనివాస్ గారు. కానీ అవార్డు వచ్చినప్పుడు మమ్మల్ని పిలవలేదు. మ్యూజిక్ డైరెక్టర్ మీరిద్దరు కదా వెళ్ళింది..మేమేమన్నా ఫీలయ్యామా..ఐనా మనం ఇక్కడ డిబేట్ పెట్టుకోవడానికి రాలేదు ..మీరు ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోండి" అంటూ అనంత శ్రీరామ్ పై నాగశౌర్య సీరియస్ ఐపోయాడు.. ‘‘లిరిక్ రైటర్ ని గుర్తుపెట్టుకోలేనప్పుడు నాకు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు.
కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. లిరిక్ రైటర్ అనేవాణ్ణి గుర్తించకపోతే కష్టం’’ అంటూ అనంత్ శ్రీరామ్ ఇంటర్వ్యూ నుంచి వాకౌట్ చేసేసారు. ఇది చూసేసరికి ఆడియన్స్ కి ఒక్క నిమిషం ఎం జరుగుతుందో అర్ధం కాలేదు. ఈ డిస్కషన్ మొత్తం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఫైనల్ గా డిస్కషన్ ఆగాక మూవీ టీమ్ అంతా కలిసి ఒక ట్విస్ట్ ఇచ్చారు. అంతకు ముందు జరిగినదంతా మళ్ళీ ప్లే చేసి చూపించేసరికి అసలు విషయం అరమయ్యింది. ఇదంతా వీళ్ళు ప్లాన్ చేసుకుని చేసినట్లు వీడియో ఎండింగ్ లో చెప్పారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
