అఫీషియల్.. రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్!
on Jun 8, 2023
రేపు(జూన్ 9న) మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరగనుంది. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ యువ ప్రేమ జంటకి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వరుణ్, లావణ్య కలిసి 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాలలో నటించారు. ఆ సినిమాలతో దగ్గరైన వీరు ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారని ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. మెగా ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఈవెంట్స్ లో లావణ్య కనిపించడం ఆ వార్తలకు బలం చేకూర్చింది. మరోవైపు కొద్దిరోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. త్వరలో తన కుమారుడుకి పెళ్లి చేయబోతున్నామని, మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు. అప్పటి నుంచి వరుణ్ పెళ్లి గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల వరుణ్-లావణ్య నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారైందని, వీరి నిశ్చితార్థం బంధువులు, సన్నిహితుల సమక్షంలో జూన్ 9న జరగనుందని బలంగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమవుతున్నాయి. రేపు వరుణ్-లావణ్య నిశ్చితార్థం జరగనుంది. ఈ ఏడాది చివరిలో వీరి వివాహాం జరగనుందని సమాచారం.
Also Read