కేతికతో జంటగా వచ్చిన నాగశౌర్య!
on Jul 30, 2021

నాగశౌర్య ప్రధాన పాత్రలో ‘లక్ష్య’ పేరుతో ఓ స్పోర్ట్స్ డ్రామా సిద్ధమవుతోంది. ఆర్చరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి కేవలం హీరో పోస్టర్లు, గ్లిమ్స్ మాత్రమే బయటకు వచ్చాయి. కాగా, తాజాగా హీరోయిన్ కేతికా శర్మ-శౌర్య జంటగా ఉన్న ఓ పోస్టర్‌ని చిత్రబృందం నెట్టింట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో శౌర్య నుదుటిపై ముద్దు పెడుతున్న కేతికను మనం చూడవచ్చు.
ఇది నాగశౌర్య నటిస్తోన్న 20వ చిత్రం. ఇప్పటివరకూ మనం చూడని కొత్త లుక్‌లో అతను కనిపించనున్నాడు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను విలక్షణ నటుడు జగపతి బాబు పోషిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



