డిసెంబర్ లో శ్రీనివాస్ చైతుల సినిమా
on Nov 18, 2013

నాగార్జునతో "డమరుకం" వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మరో చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. నాగచైతన్య హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం డిసెంబర్1 నుండి ప్రారంభం కానుంది. నాగచైతన్య సరసన హన్సిక హీరోయిన్ గా నటించనున్నది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో చైతు కొత్తగా కనిపించనున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం చైతు "ఆటోనగర్ సూర్య", "మనం" చిత్ర షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



