మహేశ్ చిత్రంలో నదియా?
on May 12, 2021
సూపర్ స్టార్ మహేశ్ బాబు బాలనటుడిగా నటించిన చిత్రాల్లో `బజారు రౌడి` (1988) ఒకటి. మహేశ్ అన్న రమేశ్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో నదియా ద్విపాత్రాభినయం చేసింది. అంతేకాదు.. అందులో మహేశ్, నదియా మధ్య కొన్ని కాంబినేషన్ సీన్స్ కూడా ఉంటాయి. కట్ చేస్తే.. 33 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత మహేశ్, నదియా మరోసారి కలిసి నటించనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `అతడు`, `ఖలేజా` తరువాత మహేశ్ ముచ్చటగా మూడో చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. `#SSMB 28` అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాలో మహేశ్ కి తల్లి పాత్రలో తన `లక్కీ క్యారెక్టర్ ఆర్టిస్ట్` అయిన నదియాని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట త్రివిక్రమ్. తన `అత్తారింటికి దారేది`, `అ ఆ` చిత్రాల్లో కథానాయిక(సమంత)కి అమ్మగా నటించిన నదియాకి.. కొత్త చిత్రంలో జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ అన్నట్లుగా హీరో మదర్ రోల్ ని ఆఫర్ చేశారట త్రివిక్రమ్. త్వరలోనే నదియా ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. లాంగ్ గ్యాప్ తరువాత మహేశ్ కాంబినేషన్ లో నటించనున్న నదియాకి తాజా ప్రయత్నం ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి. అలాగే.. త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ అందుకుంటుందా? లేదా? అన్నది కూడా ఆసక్తికరమే.
కాగా, ప్రస్తుతం నదియా చేతిలో `దృశ్యం 2`, `గని`, `వరుడు కావలెను` చిత్రాలు ఉన్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
