చిన్న సినిమాకు 'పుష్ప' బ్యానర్ అండదండలు!
on Dec 29, 2021

స్వల్ప కాలంలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన కొన్ని చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్టయ్యాయి. రీసెంట్‌గా ఆ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన 'పుష్ప' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీసును కొల్లగొడుతోంది. అలాంటి ఆ సంస్థ చిన్న బడ్జెట్ సినిమాలకు అండగా నిలవాలని సంకల్పించింది. అందులో భాగంగా సుధీర్‌బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీని సమర్పిస్తోంది. ఈ మూవీకి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు.
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాని బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై బి. మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కంటెంట్ నచ్చడంతో ఈ సినిమాని సమర్పించడానికి మైత్రి మూవీ మేకర్స్ ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పి.జి. విందా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
'ఉప్పెన', 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలతో వరుసగా రెండు హిట్లు అందుకున్న సెన్సేషనల్ హీరోయిన్ కృతి శెట్టికి ఇది మూడో సినిమా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



