నా భార్య, నేను విడిపోయాం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంచలన ప్రకటన!
on Dec 29, 2021

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్.. జిల్లా, చినబాబు, విశ్వాసం, పెద్దన్న వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఆయన.. తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు తాజాగా సంచలన ప్రకటన చేశారు.

ఇమ్మాన్ 2008 లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మోనికా రిచర్డ్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే 12 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికినట్లు తాజాగా ఇమ్మాన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. "జీవితం మమ్మల్ని విభిన్న మార్గాల్లో తీసుకెళ్తున్నందువల్ల.. పరస్పర అంగీకారంతో నేను, మోనికా చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాము. ఇకపై మేము భార్యాభర్తలు కాదు. మా ప్రైవసీకి భంగం కలిగించకుండా, జీవితంలో ముందుకు సాగడానికి మాకు అందరూ సహకరించాలని నేను కోరుతున్నాను." అంటూ ఇమ్మాన్ ట్వీట్ చేశారు.

ఇమ్మాన్ విడాకుల ప్రకటన పలువురిని షాక్ కి గురి చేసి ఉండొచ్చు. కానీ వారి విడాకుల గురించి ఆయన సన్నిహితులకు ముందే తెలుసని తెలుస్తోంది. ఇమ్మాన్ కూడా తన ట్వీట్ లో 2020, నవంబర్ నాటికే విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. కానీ అధికారికంగా మాత్రం తాజాగా ప్రకటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



