మహేష్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్.. 'మురారి వా' వీడియో సాంగ్ వచ్చేసింది
on Jun 7, 2022

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమాలో మొదటగా అనుకున్న 'మురారి వా' అనే మెలోడీ సాంగ్ కి బదులుగా 'మ మ మహేశా' అనే మాస్ సాంగ్ ని యాడ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే 'మహేశా' సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. 'మురారి వా' సాంగ్ కూడా కావాలంటూ ఫ్యాన్స్ నుంచి డిమాండ్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల థియేటర్స్ లో 'మురారి వా' సాంగ్ ని సినిమాలో జత చేసిన మూవీ టీమ్.. తాజాగా యూట్యూబ్ లో వీడియో సాంగ్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.
థమన్ సంగీతం అందించిన 'సర్కారు వారి పాట'లోని 'మురారి వా' సాంగ్ అలరిస్తోంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం.. శృతి రంజని, గాయత్రి, శ్రీ కృష్ణ గానం ఆకట్టుకున్నాయి. శ్రీ కృష్ణుడి థీమ్ తో చేసిన సాంగ్ పిక్చరైజేషన్ కన్నుల విందుగా ఉంది. మహేష్, కీర్తి సురేష్ జోడి ఈ సాంగ్ లో మరింత అందంగా కనిపిస్తోంది. సాంగ్ లో మహేష్ కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకుడు. మే 12 న విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



