'డాక్టర్ స్ట్రేంజ్' రైటర్ మెచ్చిన 'ఆర్ఆర్ఆర్'
on Jun 7, 2022

థియేటర్స్ లో రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ఓటీటీలోనూ సంచనాలు సృష్టిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ మూవీస్ లో వరల్డ్ వైడ్ గా టాప్ లో నిలవడమే కాకుండా.. హాలీవుడ్ సెలబ్రిటీలను సైతం మెప్పిస్తోంది. తాజాగా 'డాక్టర్ స్ట్రేంజ్' ఫిల్మ్ రైటర్ సి.రాబర్ట్ కార్గిల్ 'ఆర్ఆర్ఆర్'ని ప్రశంసించాడు.
'ఆర్ఆర్ఆర్' మూవీ గురించి ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు రాబర్ట్ కార్గిల్. గత రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్' చూశానని, తాను కూడా ఆర్ఆర్ఆర్ ను ఆరాధించే వారి లిస్ట్ లో చేరిపోయానని అన్నాడు. ఇది తాను చూసిన అత్యంత క్రేజీ, సిన్సియర్, బ్లాక్‌బస్టర్ అని కొనియాడాడు. తాను ఈ వారం మళ్ళీ ఈ సినిమా చూస్తానని తెలిపాడు.
'ఆర్ఆర్ఆర్' మూవీని ప్రశంసిస్తూ హాలీవుడ్ రైటర్ రాబర్ట్ కార్గిల్ ట్వీట్ చేయడం పట్ల ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ రాబర్ట్ కార్గిల్ ధన్యవాదాలు తెలిపింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



