Akhanda 2: బాలయ్య తాండవం.. అఖండతో ఓవర్సీస్ లో సంచలన రికార్డు!
on Dec 15, 2025

'అఖండ-2'తో బాలయ్య మరో సంచలనం
నార్త్ అమెరికాలో అరుదైన రికార్డు
సీనియర్ స్టార్స్ లో ఒకే ఒక్కడు
'అఖండ-2'తో బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతున్నాడు నందమూరి బాలకృష్ణ. సింహా, లెజెండ్, అఖండ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీ.. డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్ షోలతో థియేటర్లలో అడుగుపెట్టి బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. ఓవర్సీస్ లోనూ అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటుతోంది. (Akhanda 2 Thaandavam)
నార్త్ అమెరికాలో అఖండ-2 సినిమాని మోక్ష మూవీస్ విడుదల చేసింది. ఈ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ లోనే నార్త్ అమెరికాలో 750K డాలర్లకి పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మోక్ష మూవీస్ ప్రకటించింది. ప్రస్తుత జోరు చూస్తుంటే.. ఈ వారంలో 1 మిలియన్ క్లబ్ లో చేరడం ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే బాలయ్య వరుసగా ఐదోసారి ఈ ఫీట్ సాధించినట్లు అవుతోంది.
Also Read: అఖండ ప్రభంజనంలో మోగ్లీ ఎంత కలెక్ట్ చేసిందంటే..?
2021లో విడుదలైన 'అఖండ'తో బాలకృష్ణ విజయ పరంపర మొదలైంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో వరుసగా నాలుగు విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. ఈ నాలుగు సినిమాలు నార్త్ అమెరికాలో 1 మిలియన్ క్లబ్ లో చేరడం విశేషం. ఇప్పుడదే బాటలో 'అఖండ-2' పయనిస్తోంది. సీనియర్ స్టార్స్ లో ఇలా వరుసగా ఐదుసార్లు 1 మిలియన్ ఫీట్ సాధించిన ఏకైక హీరో బాలకృష్ణ కావడం అరుదైన ఘనతగా చెప్పవచ్చు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



