ENGLISH | TELUGU  

మహాభారతానికి మోడీ సపోర్ట్..వివాదానికి తెరపడినట్లేనా..?

on Jun 5, 2017

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో మహాభారతాన్ని తీస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపాడు మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. కానీ ఇంతవరకు ఆ సినిమాలో ఎవరు ఏ పాత్ర చేస్తున్నారు..లాంటి ప్రశ్నలకు క్లారిటీ ఇవ్వకుండానే పబ్లిసిటీని మాత్రం ఊదరగొడుతున్నారు. సినిమా ఇంకా సెట్స్‌ మీదకు వెళ్లకుండానే మహాభారతం వివాదంలో చిక్కుకుంది. మహాభారతం అనే టైటిల్ వ్యాసుడికి మాత్రమే సొంతమని సినిమాకు ఆ పేరు పెడితే ఊరుకోబోమని..కేరళకు చెందిన హిందూ ఐక్య వేదిక మోహన్‌లాల్‌కు అల్టీమేటం ఇచ్చింది.

మహాభారతానికి బదులు ఏ నవల ఆధారంగా సినిమా తీస్తున్నారో సినిమాకు కూడా అదే టైటిల్ పెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో సినిమాకు ఊహించని వ్యక్తి మద్ధతు ప్రకటించినట్లు మల్లువుడ్‌లో చర్చించుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు భారత ప్రధాని నరేంద్రమోడీ. పీఎంవో నుంచి చిత్రయూనిట్‌ను అభినందిస్తూ ఓ లేఖ వచ్చిందని, దేశానికే గర్వకారణమైన సినిమాను తెరకెక్కిస్తున్నందుకు ప్రధాని యూనిట్ సభ్యులను అభినందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది నిజమో..లేక వివాదానికి తెరదించేందుకు ఎవరైనా పుకార్లు సృష్టించారా అన్నది తెలియాల్సి ఉంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.