థియేటర్ లో పది మంది ప్రేక్షకులు.. చెప్పుతో కొట్టుకున్న డైరెక్టర్
on Sep 1, 2025

మొన్న అగస్ట్ 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'త్రిబాణధారి బార్బరిక్(Tribanadhari Barbarik). సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకి 'మైథలాజికల్' టచ్ ని కూడా ఇవ్వడం జరిగింది. సత్యరాజ్(Sathyaraj)ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించగా , నూతన దర్శకుడు 'మోహన్ శ్రీవాత్సవ'(MOhan Srivatsa)తెరకెక్కించాడు.
రీసెంట్ గా బార్బరిక్ ఆడుతున్న ఒక థియేటర్ కి మోహన్ శ్రీవత్స వెళ్ళాడు. ఆ సమయంలో థియేటర్ లో పది మంది ప్రేక్షకులు మాత్రమే ఉన్నారు. ఈ విషయంపై శ్రీవత్స ఒక వీడియో రిలీజ్ చేసాడు. అందులో ఆయన కన్నీళ్ల పర్యంతమవుతు బార్బరీక్ ఎంతో బాగున్నా కూడా ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదు. కంటెంట్ బాగుందని మలయాళ చిత్రాలని అయితే ఆదరిస్తున్నారు. కానీ మన తెలుగు సినిమాని ఆదరించడం లేదు. అందుకే మలయాళ చిత్ర సీమకి వెళ్లి, అక్కడ సినిమా తెరకెక్కించి తెలుగులో రిలీజ్ చేస్తాను. మూవీ విడుదలకి ముందు బార్బరీక్ బాగోపోతే చెప్పుతో కొట్టండని చెప్పాను. ఇప్పుడు ప్రేక్షకులు రావడం లేదు కాబట్టి నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నాను. థియేటర్ లో ఉన్న ప్రేక్షుకులు మాత్రం సినిమా చాలా బాగుందని నన్ను హగ్ కూడా చేసుకున్నారు.'బార్బరిక్' కోసం రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాను. నేను ఎక్కడ ఆత్మ హత్య చేసుకుంటానేమో అని నా భార్య భయపడుతోందని శ్రీవత్స చెప్పుకొచ్చాడు .
క్రైమ్ థ్రిల్లర్ కథకి బార్బరిక్ మూడు బాణాల కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. మహాభారత కాలంలోని భీముడి మనవడు, ఘటోత్కచుని కుమారుడే బార్బరిక్. సత్యరాజ్ కొన్ని సీన్స్ లలో బార్బరీక్ గా కనిపిస్తాడు. రాజా సాబ్ ఫేమ్ మారుతీ సమర్పకుడిగా వ్యవహరించగా, విజయపాల్ రెడ్డి నిర్మించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



