కర్ణాటక సీఎంని కలిసిన రామ్ చరణ్..
on Aug 31, 2025

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిశారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' అనే సినిమా చేస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ షూటింగ్ కర్ణాటకలోని మైసూర్ లో జరుగుతోంది. చిత్ర షూటింగ్ కోసం కర్ణాటక వెళ్ళిన చరణ్.. అక్కడ సీఎం సిద్ధరామయ్యని మర్యాదపూర్వకంగా కలిశారు.
"పెద్ది సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఈరోజు మైసూర్‌లో నన్ను కలిసి కాసేపు మాట్లాడారు." అంటూ సిద్ధరామయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
'పెద్ది' షూటింగ్ కోసం ఇటీవల మైసూర్ వెళ్ళిన చరణ్.. తన అమ్మమ్మ, అల్లు కనకరత్నమ్మ మరణ వార్త తెలిసి శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. ఈరోజు మళ్ళీ ఆయన మైసూర్ వెళ్ళారు.
వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2026, మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



