మిరాయ్ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్
on Sep 13, 2025

'హనుమాన్'(Hanuman)తర్వాత 'తేజ సజ్జా'(Teja Sajja)నిన్న వరల్డ్ వైడ్ గా 'మిరాయ్'(Mirai)తో మరో సారి థియేటర్స్ లో అడుగుపెట్టాడు. శ్రీరాముని(Sriramudu) ఆయుధమైన 'మిరాయ్' కి , మౌర్య రాజ చక్రవర్తి అశోకుడు(Ahokudu)శక్తులకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే పాయింట్ తో 'మిరాయ్' తెరకెక్కింది. దీంతో సెల్యులాయిడ్ పై ఒక కొత్త ప్రపంచం ప్రత్యక్షమవ్వడంతో పాటు, రాజీపడని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)నిర్మాణ విలువలు, కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamneni)దర్శకత్వ ప్రతిభ థియేటర్స్ కి ప్రేక్షకులని పరుగులు పెట్టేలా చేస్తుంది.
ఈ మూవీ తొలిరోజు ఇండియా వ్యాప్తంగా 12 కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఓవర్ సీస్ కి సంబంధిన కలెక్షన్స్ వివరాలు తెలియాలి. కెరీర్ పరంగా తేజ సజ్జ 'హనుమాన్' తో 15 కోట్ల గ్రాస్ ని రాబట్టాడు. దీంతో తొలి రోజు కల్లెక్షన్స్ కి సంబంధించి 'మిరాయ్' రెండవ చిత్రంగా నిలిచింది. ఇక మూవీ బాగుందనే టాక్ ప్రేక్షకుల నుంచి వస్తుండంతో, వీకెండ్ లో మరిన్ని భారీ కలెక్షన్స్ సాధించే సాధించే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ రోజు నుంచి ఇండియా వ్యాప్తంగా ఐదు షో లు ప్రదర్శిస్తుండటం, అడ్వాన్స్ బుకింగ్ కూడా అన్నిఏరియాల్లో ఫుల్ అవ్వడమే ఇందుకు నిదర్శనమని సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.
వేద గా తేజ సజ్జ ,మహావీర్ గా మంచు మనోజ్(Manchu Manoj)పోటాపోటీగా నటించారు. శ్రీయ,రితిక నాయక్, జగపతి బాబు లు తమ పాత్ర పరిధి మేరకు నటించి సినిమా విజయంలో బాగస్వామ్యమయ్యారు. సుమారు 60 కోట్ల బడ్జెట్ తో మిరాయ్ తెరకెక్కినట్టుగా తెలుస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



