నిధి అగర్వాల్ కి అన్యాయం చేసిన మిరాయ్ టీమ్!
on Sep 12, 2025

తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'మిరాయ్'(Mirai). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా తాజాగా విడుదలై.. క్రిటిక్స్ నుంచి, ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. తేజ, మనోజ్ తో పాటు టీం అందరిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అదే సమయంలో ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ కి అన్యాయం జరిగిందనే చర్చ కూడా జరుగుతోంది. (Nidhhi Agerwal)
'మిరాయ్'లో నిధి అగర్వాల్ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అయితే కథ ఫ్లో మరియు నిడివిని దృష్టిలో పెట్టుకొని.. చివరి నిమిషంలో సినిమా నుంచి ఆ సాంగ్ ని తొలగించారు. అదే కాదు.. 'మిరాయ్' నుంచి 'వైబ్ ఉంది' అనే ఒకే ఒక్క సాంగ్ విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ ని కూడా సినిమా నుంచి తొలగించడం విశేషం. కథ ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా, రన్ టైంని పెంచకుండా.. సాంగ్స్ ని తొలగించి మంచి పని చేశారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.
అయితే 'మిరాయ్' సినిమాలో ఆ స్పెషల్ సాంగ్ ఉండుంటే నిధి అగర్వాల్ కెరీర్ కి ఎంతో కొంత హెల్ప్ అయ్యుండేది. గ్లామర్ హీరోయిన్ గా తక్కువ కాలంలోనే యూత్ కి చేరువైన నిధి.. వేరే సినిమాలు కమిట్ అవ్వకుండా 'హరి హర వీరమల్లు'కోసం దాదాపు మూడేళ్లు కేటాయించింది. కానీ, ఆ మూవీ రిజల్ట్ దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం నిధి చేతిలో 'ది రాజా సాబ్' మాత్రమే ఉంది. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రాన్ని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మిస్తోంది. 'రాజా సాబ్'కి ముందు 'మిరాయ్' సాంగ్ క్లిక్ అయినట్లయితే.. నిధిలో కొత్త ఉత్సాహం వచ్చి ఉండేది. కనీసం ఆ సాంగ్ ని యూట్యూబ్ లో అయినా విడుదల చేస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



