రాజు ఆత్మహత్యపై చిరంజీవి రియాక్షన్
on Sep 16, 2021

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న రాజు.. రైల్వే ట్రాక్ పై విగతజీవిగా కనిపించాడు. ఘట్ కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూరు దగ్గర రైల్వే ట్రాక్ పై రాజు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
రాజు ఆత్మహత్యపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా రాజు ఆత్మహత్యపై స్పందిస్తూ.. "అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనకు తానే శిక్షించు కోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌరసమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు పౌరసమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం వుంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగినవిధంగా ఆదుకోవాలి."అన్నారు.
ఇక ఈ ఘటనపై మంచు మనోజ్ స్పందిస్తూ.. 'దేవుడు ఉన్నాడు' అని వ్యాఖ్యానించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



