'హనుమాన్' నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్!
on Sep 16, 2021
'జాంబి రెడ్డి' సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'హను మాన్'. తెలుగులో మొదటి సూపర్ హీరో సినిమా కావడంతో 'హను మాన్'పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ వచ్చింది.
'హను మాన్' మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ ను వదిలి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 18న ఉదయం 10.08 గంటలకు విడుదల కానుంది అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానిపై "అంజనాద్రి ప్రపంచం నుంచి హనుమంతుడిని సెప్టెంబర్ 18న మీట్ అవ్వండి" అని రాశారు. 'హను మాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
'అ!', 'కల్కి', 'జాంబి రెడ్డి' వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. 'హను మాన్'తో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
Also Read