మెగాస్టార్ తో నటిస్తున్న లేడీ ఎమ్మెల్యే..!
on May 21, 2016

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా గురించి రోజుకో టాక్ వస్తోంది. ఇప్పటి వరకూ క్యాస్టింగ్ గురించి చాలా ఆసక్తికరమైన వార్తలు వినబడ్డాయి. ఇప్పటి వరకూ హీరోయిన్ ఫైనల్ కాలేదన్న వార్తే అన్నింటిలోకీ హైలెట్. ఇక మొన్నీమధ్యనే బన్నీ సరసన సరైనోడులో ఎమ్మెల్యేగా సందడి చేసిన క్యాథరీన్ ట్రెసాను చిరు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేశారట. స్పెషల్ సాంగ్ తో పాటు, సినిమాలో రెండు సీన్స్ లో ఈ భామ సందడి చేసే అవకాశం లేకపోలేదు. ఇక చిరు పక్కన హీరోయిన్ గా అనుష్క లేక నయనతారా అన్న విషయంలో మాత్రం మూవీ యూనిట్ లో ఇంకా క్లారిటీ రాలేదట. ఎక్కువ శాతం అవకాశాలు అనుష్క కే ఉన్నాయి. గతంలో స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ సరసన ఒక స్పెషల్ సాంగ్ లో చిందేసింది అనుష్క. తిరిగి ఆయన రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో కూడా ఆమె అయితేనే కరెక్ట్ అని చిరు ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చిరు అండ్ కో ఎవరికి ఓటేస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



