చిరంజీవి కత్తిలో హీరోయిన్ ఆమేనా..?
on Mar 3, 2016

ఎంతో కాలంగా మెగాస్టార్ రీఎంట్రీ గురించి వార్తలు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. మొదట ఆయన ఎవరి డైరెక్షన్లో సినిమా చేస్తారోనని ఎదురుచూసిన మెగాఫ్యాన్స్ కు, వినాయక్ కన్ఫామ్ అయిన తర్వాత ఏ స్టోరీతో చేస్తారోనని సస్పెన్స్ వెంటాడింది. కత్తి రీమేక్ ఫిక్సయ్యాక షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, హీరోయిన్ ఎవరు అని మెగాఫ్యాన్స్ లో మరో డిబేట్ మొదలైంది. ఇప్పటివరకూ హీరోయిన్ ఎవరు అన్న దానిపై క్లారిటీ లేకపోయినా, సీనియర్ అయిన నయనతారను తీసుకోవడం వైపే మూవీ టీం మొగ్గు చూపుతున్నారు.

మరో వైపు సాక్షాత్తూ మెగాస్టారే, తనకు తమన్నా అయితే కరెక్ట్ గా ఉంటుందని చాలా సందర్భాల్లో చెప్పారు. తమన్నా కూడా ఆయనతో కలిసి నటించడం కోసం ఎదురుచూస్తున్నానంటూ డైరెక్ట్ గానే సిగ్నల్స్ ఇచ్చేసింది.

లేటెస్ట్ గా వెంకటేశ్ తో సినిమాకు ఓకే చెప్పి, చిరుతో యాక్ట్ చేయడానికి తను కూడా రెడీ అనే సిగ్నల్ ను ఇచ్చింది మరో అందాల భామ కాజల్. వెంకటేష్ తో చేసిన హీరోయిన్, చిరంజీవి సినిమాకు కూడా అదే ఇమేజ్ ను క్యారీ చెయగలదు కాబట్టి, ఇప్పుడు కత్తి హీరోయిన్ల రేస్ లోకి కాజల్ కూడా వచ్చిందంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. కానీ తనయుడితో చేసిన కాజల్ పక్కన చేయడానికి చిరు సరేనంటారా..? ఛాయిస్ అయితే ఆయనదే..మరి ఆయన ఎవరికి సిగ్నల్ ఇస్తారోచూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



