"కత్తి" కోసం మెగా ఫ్యామిలీ రాజీ..!
on Jun 12, 2016

దాదాపు ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించి తన 150వ సినిమాకు పచ్చ జెండా ఊపారు మెగాస్టార్ చిరంజీవి. అయితే కథ కోసం మెగా ఫ్యామిలీ అనేక కథలను కాచి వాడపోసింది. అలా చివరకు తమిళస్టార్ డైరెక్టర్ మురుగదాస్, విజయ్ కాంభోలో తెరకెక్కి సూపర్‌హిట్ అయిన కత్తిపై చిరు కన్నేశారు. చాలా సిట్టింగ్‌ల తర్వాత కత్తి రిమేక్‌లో తాను నటించబోతున్నట్టు మెగాస్టార్ ప్రకటించాడు.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ కథ నాదంటూ తెలుగు రచయిత ఎన్ నరసింహారావు అప్పట్లోనే మురుగదాస్‌తో న్యాయపోరాటం చేశారు. అయితే ఆయన పోరాటం ఫలించలేదు. తరువాత చిరంజీవి రీఎంట్రీ సినిమాగా కత్తి సినిమాను రీమేక్ చేస్తున్నట్లుగా వార్తలు రావటంతో నరసింహారావు మరోసారి తన పోరాటాన్ని ప్రారంభించాడు. కత్తి సినిమా విడుదలకు ముందే తన కథను తెలుగు సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించినట్టుగా ఆధారాలు చూపించాడు. వీటిని పరిశీలించిన సినీ పెద్దలు, నరసింహారావుకు న్యాయం జరిగే వరకు చిరు సినిమా షూటింగ్‌కు వెళ్లరాదంటూ కార్మికులను హాజరుకావద్దని తెలిపారు.
దీంతో వివాదానికి తెరదించేందుకు నరసింహారావుతో మెగా టీం సంప్రదింపులు జరుపుతోంది. ఫైనల్‌గా కథాసహకారం అంటూ వేస్తాం అన్న హామితో పాటు 40 లక్షల రూపాయల పారితోషికం కూడా ఇచ్చేందుకు కత్తిలాంటోడు సినిమా యూనిట్ అంగీకరించింది. యూనిట్ సభ్యులు చెప్పిన హామిలతో నరసింహారావు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుండటంతో ఇక వివాదం ముగిసినట్లే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



