విలక్షణ నటుడిది ఆత్మహత్యా..హత్యా..తేల్చనున్న సీబీఐ
on Jun 12, 2016

తన విలక్షణ నటనతో దక్షిణాది సినీ పరిశ్రమపై చెరగని ముద్రవేసిన మళయాళ నటుడు కళాభవన్ మణి మరణంపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయన చనిపోయి మూడు మాసాలు గడుస్తున్నా..కేరళ పోలీసులకు ఏ ఆధారం చిక్కలేదు..మణి మరణానికి ఏ ఒక్క కారణాన్ని స్పష్టంగా వెల్లడించపోవడంతో పాటు దర్యాప్తు పెడదోవ పట్టిందన్న ఆరోపణలు వస్తుండటంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి లేఖ రాసింది. దాదాపు 200పైగా సినిమాల్లో నటించిన మణి..ఈ ఏడాది మార్చి 6న అనుమానాస్పద స్ధితిలో మరణించారు. ఆయన మృతదేహంలో విష రసాయనాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదికతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. అంతేకాకుండా కళాభవన్ మృతి వెనుక కొందరి హస్తం ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక నిజాలు ఏమిటో త్వరలోనే వెలుగులోకి వస్తాయని వారు ఆశిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



