మెగాస్టార్ చిరంజీవితో పెట్టుకుంటున్న జగపతి బాబు..!
on May 16, 2016

మెగాస్టార్ 150 వ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ కాస్టింగ్ ఉండాలని చిరు ఇప్పటికే ఆర్డర్ వేసేశారట. జూలై నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఈ సినిమాకు ఇప్పుడు క్యాస్టింగ్ జరుగుతోంది. సినిమాలోని కీలక పాత్రల కోసం నటుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉంది మూవీ టీం. హీరోయిన్ గా అనుష్క లేదా నయనతార అని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక సినిమాలో మరో కీలక పాత్ర విలన్. చిరును ఢీకొట్టే సత్తా ఇప్పుడున్న విలన్లలో జగపతిబాబుకు మాత్రమే ఉందని మూవీ టీం భావిస్తున్నారట. కత్తిలో విలన్ పాత్ర చాలా స్టైలిష్ గా ఉంటుంది. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిన విలన్ పాత్ర డబ్బు కోసం ఎంత క్రూరత్వమైనా చేస్తుంది. ఆ పాత్రను, అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ ను పోషించగల కెపాసిటీ నిస్సందేహంగా ఇప్పుడున్న వాళ్లలో జగపతిబాబుకు ఉంది. అయితే, ప్రస్తుతం చరణ్ తనీ ఒరువన్ సినిమా రీమేక్ లో విలన్ గా చేస్తున్న అరవింద్ స్వామి కూడా విలన్ గా అద్భుతంగా చేస్తుండటంతో, వీళ్లిద్దరిలో ఎవర్ని తీసుకోవాలనేదాని గురించి ఆలోచనలో పడ్డారు చిరు అండ్ కో. త్వరలోనే దీనిపై క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



