నీహారిక స్టార్ హీరోయిన్ రాస్కోండి అంటున్నాడు..!
on May 16, 2016
' ఒక మనసు 'తో మెగావారమ్మాయి నీహారిక బుల్లితెర మీద నుంచి, వెండితెరంగేట్రం చేస్తోంది. ఇప్పటికే స్మాల్ స్క్రీన్ పై స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నీహారిక, బిగ్ స్క్రీన్ పై కూడా సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంటుంది చూడండి అంటున్నాడు మూవీ హీరో నాగ శౌర్య. నిజానికి ఇప్పటికే శౌర్య హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఫస్ట్ టైం హీరోయిన్ గా చేస్తున్న నీహారిక మొత్తం క్రెడిట్ అంతా కొట్టేయడం అతనికి తప్పనిసరిగా ఇబ్బంది కలిగిస్తుందనే వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ అపోహలే అని తన స్టేట్ మెంట్ తో తేల్చేశాడు నాగశౌర్య. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్ని స్పీడ్ చేసే పనిలో ఉన్న సినిమా లీడ్ పెయిర్, ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద స్పందించాడు నాగశౌర్య. నీహారిక చాలా సహజత్వంతో నటిస్తుందని, నటన పరంగా చాలా మెచ్చూర్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని ఆమెను తెగ పొగిడేశాడు. త్వరలోనే ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని, టాప్ స్టార్స్ తో యాక్ట్ చేస్తుందని చెబుతున్నాడు. మల్లెల తీరంలో ఫేమ్ రామరాజు డైరెక్ట్ చేసిన ' ఒక మనసు ' కు త్వరలోనే ఆడియో ఫంక్షన్ జరగనుంది. ఈ ఫంక్షన్ కు మెగాహీరోలందరూ హాజరవుతారనే టాక్ నడుస్తోంది.
Also Read