మెగా కాంపౌండ్ స్టార్స్.. ఫెస్టివల్స్ స్పెషల్!
on Aug 3, 2021

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇలా మెగా కాంపౌండ్ కి చెందిన స్టార్ హీరోలు ఒక్కో ఫెస్టివల్ ని టార్గెట్ చేసుకుని థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు. వీరిలో రామ్ చరణ్ ముందుగా సిల్వర్ స్క్రీన్ పై ఎంటర్టైన్ చేయనున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటించిన బడా మల్టిస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`.. విజయదశమి కానుకగా పలు భాషల్లో అక్టోబర్ 13న రిలీజ్ కానుంది.
అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `పుష్ప`కి చెందిన తొలి భాగం `పుష్ప - ద రైజ్`.. క్రిస్మస్ కానుకగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే దగ్గుబాటి స్టార్
రానాతో కలిసి నటిస్తున్న `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. సో.. దసరా, క్రిస్మస్, సంక్రాంతి.. ఇలా రాబోయే పండగలన్నీ మెగా కాంపౌండ్ స్టార్స్
నటించిన చిత్రాలకు చిరునామాగా నిలవబోతున్నాయన్నమాట. మరి.. మెగాస్టార్ చిరంజీవి కూడా `ఆచార్య`ని మరో ఫెస్టివల్ కి టార్గెట్ చేస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



