Home

»

Latest News

బిగ్ క్రిస్మ‌స్ క్లాష్‌.. ఆమిర్ ఖాన్‌తో ఢీకి త‌గ్గేదే లే అంటున్న‌ అల్లు అర్జున్‌!

Aug 3, 2021 3:37PM

 

అల్లు అర్జున్ మూవీ 'పుష్ప' పార్ట్‌-1ను క్రిస్మ‌స్‌కు రిలీజ్ చేస్తున్న‌ట్లు ఈరోజు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ప్యాన్ ఇండియా మూవీగా సౌత్‌లోని నాలుగు భాష‌ల‌తో పాటు హిందీలోనూ 'పుష్ప' విడుద‌ల‌వుతోంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా ర‌ష్మికా మంద‌న్న‌, విల‌న్‌గా మ‌ల‌యాళీ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ న‌టిస్తున్నారు. అయితే క్రిస్మ‌స్‌కు ఈ సినిమాని విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డ‌మే ఇప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కార‌ణం.. అదే క్రిస్మ‌స్‌కు ఇప్ప‌టికే ఆమిర్ ఖాన్ మూవీ 'లాల్ సింగ్ చ‌డ్ఢా'ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆ సినిమా నిర్మాత‌లు ప్ర‌క‌టించడం. 

అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తీస్తున్న 'పుష్ప‌'ను ప్యాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజ్ చేస్తేనే వ‌ర్క‌వుట్ అవుతుంది. అందుకే నార్త్ ఆడియెన్స్‌ను కూడా టార్గెట్ చేశారు. సౌత్‌లో క్రేజీ స్టార్స్ అయిన అర్జున్‌, ర‌ష్మిక‌, ఫ‌హ‌ద్ న‌టిస్తుండ‌టంతో ఈ ఏరియాలో ఈ మూవీపై విప‌రీత‌మైన హైప్ వ‌చ్చింది. నేష‌న‌ల్ క్ర‌ష్‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక ఇప్ప‌టికే 'మిష‌న్ మ‌జ్ను', 'గుడ్‌బై' లాంటి బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తుండ‌టంతో నార్త్‌లో ఆమెకు మంచి ఇమేజ్ ల‌భించింది. హిందీ డ‌బ్బింగ్ సినిమాల ద్వారా బ‌న్నీ కూడా నార్త్ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. దీంతో 'పుష్ప‌'తో నార్త్ ఫ్యాన్స్‌నూ టార్గెట్ చేశారు నిర్మాత‌లు.

అయితే అక్క‌డ ఆమిర్ ఖాన్‌కు ఉండే ఇమేజ్ ఎలాంటిదో తెలిసిందే. పైగా 'ఫారెస్ట్ గంప్' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీకి రీమేక్‌గా త‌యారైన 'లాల్ సింగ్ చ‌డ్ఢా'తో ఆయ‌న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఆయ‌న జోడీగా టాప్ యాక్ట్రెస్ క‌రీనా క‌పూర్ న‌టించింది. మ‌న అక్కినేని హీరో నాగ‌చైత‌న్య సైతం ఓ స్పెష‌ల్ రోల్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు. అంతేనా.. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్ షారుఖ్‌, స‌ల్మాన్ సైతం అతిథి పాత్ర‌ల్లో మెర‌వ‌నున్నారు. ఆమిర్ స్వ‌యంగా నిర్మించిన 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌'తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై, ఇటు ప్రేక్ష‌కుల్నీ, అటు విమ‌ర్శ‌కుల్నీ మెప్పించిన అద్వైత్ చంద‌న్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

అటు 'లాల్ సింగ్ చ‌డ్ఢా', ఇటు 'పుష్ప‌'.. దేనిక‌వే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ల‌తో వ‌స్తున్న సినిమాలు. అయితే నార్త్‌లో ఆమిర్‌ను ఢీకొట్టి అర్జున్ నిల‌వ‌గ‌ల‌డా?.. అనేది విశ్లేష‌కుల సందేహం. బ‌న్నీ ఫ్యాన్స్ మాత్రం ఎదురుగా ఉన్న‌ది ఏ హీరో అయితేనేం.. 'పుష్ప' ముందు ఎవ‌రూ ఆగ‌లేర‌నే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఏదేమైనా సంక్రాంతి కంటే ముందు ప్యాన్ ఇండియా లెవ‌ల్లో ఓ భీక‌ర స‌మ‌రానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌న్న మాటే. ఈ స‌మ‌రంలో ఎవ‌రు నెగ్గుతారో, ఎవ‌రు ఓడుతారో.. లెట‌జ్ వెయిట్ అండ్ సీ..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com