2022లో మెగా బ్రదర్స్ ట్రిపుల్ ధమాకా!
on Oct 16, 2021
మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడు సినిమాలు వచ్చి 20 ఏళ్ళయ్యింది. అప్పుడెప్పుడో 2001లో `మృగరాజు`, `శ్రీమంజునాథ`, `డాడీ` చిత్రాలతో చివరిసారిగా ట్రిపుల్ ధమాకా ఇచ్చారు చిరు. ఇక చిరు తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. తన కెరీర్ లో ఇప్పటివరకు ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడు సినిమాలతో పలకరించిన సందర్భం అస్సలు లేదు. కట్ చేస్తే.. ఇప్పుడీ మెగా బ్రదర్స్ వచ్చే ఏడాది మూడేసి చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. చిరు టైటిల్ రోల్ లో నటిస్తున్న `ఆచార్య` ఫిబ్రవరి 4న థియేటర్స్ లోకి రానుండగా.. `గాడ్ ఫాదర్` వేసవి చివరలో విడుదలయ్యే అవకాశముందని సమాచారం. అంతేకాదు.. `భోళా శంకర్` కూడా 2022 ద్వితీయార్ధంలో జనం ముందుకు రాబోతోందని టాక్. ఇక పవన్ మేటర్ కి వస్తే, `భీమ్లా నాయక్` జనవరి 12న రిలీజ్ కానుండగా.. `హరిహర వీరమల్లు` సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 29న తెరపైకి రానుంది. అలాగే `భవదీయుడు..! భగత్ సింగ్` 2022 చివరలో సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నట్లు బజ్. మరి.. 2022లో మెగా బ్రదర్స్ వేర్వేరుగా ఇవ్వనున్న ఈ ట్రిపుల్ ధమాకా.. మెగాభిమానులను ఏ స్థాయిలో మురిపిస్తుందో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
