స్నేహ కూతురి బర్త్‌డే.. కూతురితో మీనా సందడి!
on Jan 27, 2021

తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న అందాల తార స్నేహ, సహ నటుడు తమిళుడైన ప్రసన్నను 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల ప్రేమానురాగాలకు చిహ్నంగా నాలుగేళ్ల క్రితం విహాన్ పుట్టాడు, గత ఏడాది జనవరి 24న కూతురు ఆద్యంత పుట్టింది.
వివాహం స్నేహ కెరీర్‌ను అడ్డుకోలేదు. నిజానికి ప్రసన్న ఆమె కెరీర్‌ను కొనసాగించడానికి ప్రోత్సహిస్తూ వచ్చాడు. అందుకే పెళ్లయి, పిల్లలు పుట్టాక కూడా తనకు వస్తున్న అవకాశాలలో నచ్చినవి చేస్తూ వస్తున్నారు స్నేహ. అట్లా 'సన్నాఫ్ సత్యమూర్తి', 'వినయ విధేయ రామ' లాంటి సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించారు. అంతేకాదు, ఆద్యంత కడుపులో ఉండగా, 'పట్టాస్' మూవీలో ధనుష్ జోడీగా నటించడమే కాకుండా, ఆ సినిమాలో పాత్ర పోషణ కోసం మార్షల్ ఆర్ట్స్‌ను కూడా నేర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి కూడా.
.jpg)
.jpg)
కాగా ఈ జనవరి 24న కూతురు ఆద్యంత ఫస్ట్ బర్త్‌డే వేడుకను స్నేహ, ప్రసన్న దంపతులు ఘనంగా జరిపారు. ఆద్యంత పింక్ గౌన్‌లో అదరగొట్టగా, స్నేహ ఎల్లో కలర్ గౌన్‌లో మెరిసిపోయారు. ఈ వేడుకకు నిన్నటి తరం హీరోయిన్ మీనా తన కూతురు నయనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు హీరోయిన్లు తమ కూతుళ్లతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మీనా పింక్ కలర్ సల్వార్ కమీజ్‌లో, నయనిక రెడ్ కలర్ గౌన్‌లో మెరిశారు.
.jpg)

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



