మారుతికి పోయిన చోటే దొరికింది
on Nov 12, 2015

పెద్దలు ఏ మాట చెప్పినా ఊరికే చెప్పరు. అలాంటి మంచి మాటల్లో ఒక మంచి మాట... పోయిన చోటే వెతుక్కోవాలి. మన డైరెక్టర్ మారుతి విషయంలో ఈ మాట కొంచెం మార్పుతో నిరూపణ అయింది. మారుతి ఎక్కడైతే ఏదైతే పోగొట్టుకున్నాడో అది మళ్ళీ అక్కడే దొరికింది. ఇంత తిరకాసు లేకుండా అసలు విషయానికి వస్తే, మారుతి డైరెక్టర్‌గా సక్సెస్‌లు సాధించినప్పుడు విక్టరీ వెంకటేష్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. వీళ్ళ కాంబినేషన్‌లో ‘రాధ’ అనే ప్రాజెక్టు రెడీ అయింది. అయితే ‘రాధ’ కథ నాది అంటూ ఓ రచయిత రచ్చ చేయడంతో ఆ ప్రాజెక్టు డిస్ట్రబ్ అయింది. దానికితోడు మారుతికి వరుసగా ఫ్లాపులు రావడంతో వెంకటేష్ కూడా మారుతిని కొంతకాలం రెస్టు తీసుకోమ్మా అంటూ ‘రాధ’ ప్రాజెక్టుని పక్కనే పెట్టేశాడు. అది మారుతికి పెద్ద షాక్. మారుతి పరువు అక్కడ పోయింది. అయితే ఈమధ్య మారుతి ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో హిట్ కొట్టడంతో పోయిన మారుతి పరువు మళ్ళీ వెంకటేష్ కాంపౌండ్లోనే దొరికింది. వెంకటేష్ మళ్ళీ మారుతిని పిలిచి సినిమా చేద్దామని అన్నాడు. ‘రాధ’ని పక్కన పెట్టేసి మరో కథతో ఈ సినిమా తీయబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ నవంబర్ మధ్యలోనే ప్రారంభమయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. డోన్ట్ వర్రీ.. ఈ సినిమా మారుతి చేతిలోంచి జారిపోయే అవకాశం లేదు.. ఎందుకంటే మారుతి ఇప్పుడు సక్సెస్‌లో వున్నాడు కదా...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



