అఖిల్ కి 'స్టార్లు' కనిపించలేదా??
on Nov 10, 2015
.jpg)
తెలుగు చిత్రసీమ నిండా స్టార్లే. మహేష్, పవన్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ... ఇలా ప్రతి ఇంటి నుంచి ఇద్దరు ముగ్గురు స్టార్లున్నారు. కొత్తగా అడుగుపెడుతున్న ఏ కథానాయకుడైనా సరే వీళ్ల నుంచి స్ఫూర్తి పొందాలి. వీళ్లనే పోటీగా తీసుకోవాలి. అయితే అఖిల్ ఏమంటున్నాడో తెలుసా..?? 'చిత్రసీమలో మీకు పోటీ ఎవరు?' అనే ప్రశ్నకు 'మోక్షజ్ఞ' అంటూ వెరైటీ సమాధానం చెప్పి అందరికీ ఆశ్చర్యపరిచాడు.
మోక్షజ్ఞ కాబోయే హీరో. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మోక్షజ్ఞ ఎలా ఉంటాడో, ఎన్ని అద్భుతాలు చేస్తాడో ఇప్పుడే ఊహించలేం. కనీసం శాంపిల్ చూద్దామన్నా మోక్షజ్ఞ బాలనటుడిగా సినిమాలేం చేయలేదు. అంటే.. కనీసం మోక్షజ్ఞ టాలెంట్ ఏంటో అంచనా వేయకుండా.. 'నాకు పోటీ మోక్షజ్ఞే' అంటే అర్థం ఏమిటి?? ఇప్పుడున్న హీరోలెవ్వరూ తనకు పోటీ కాదనే కదా? మహేష్, పవన్, ఎన్టీఆర్ ఇలాంటి ఉద్దండులంటే లెక్కలేదనే కదా?? 'ఇప్పుడున్న హీరోలెవరూ నాకు పోటీ కాదు.. రాబోతున్న హీరోలే నాకు పోటీ' అని అఖిల్ భావించడం... సినీ వర్గాల్ని విస్మయపరుస్తోంది.
'ఇక్కడ ఎవరికీ ఎవరూ పోటీ కాద'నో, లేదంటే 'నాకు నేనే పోటీ' అనో ఏదో క్యాలిక్లేటెడ్ సమాధానాలు చెప్పుకోవాలి కానీ, ఇలా కాంప్లికేటెడ్ మ్యాటర్‌లో తలదూర్చకూడదన్న విషయం అఖిల్‌కి ఇంకా అర్థం కాలేదు. అఖిల్ ఆన్సర్ తనకంటూ కొన్ని క్యాలిక్లేషన్లు ఉన్నాయి. 'మోక్షజ్ఞ' పేరు చెబితే.. నందమూరి అభిమానుల సపోర్ట్ తనకు లభిస్తుందన్నది అఖిల్‌లో ఉన్న ప్రొడ్యూసర్ బ్రెయిన్ కి తట్టిన ఆలోచన కావొచ్చు. కానీ ఇలాంటి తలతిక్క సమాధానాల వల్ల మిగిలిన హీరోల ఫ్యాన్స్ హర్టవుతారన్న విషయం గుర్తించుకోవాలి. లేదంటే.. అఖిల్‌కి తిప్పలు తప్పవు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



