సెప్టెంబర్ చివరి వారం.. సినిమా అభిమానులకి పండగే!
on Sep 25, 2023

సెప్టెంబర్ ఆఖరి వారం సినిమా అభిమానులకి పండగ వాతావరణాన్ని తీసుకురాబోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన స్కంద మూవీ ఈ గురువారం అంటే 28వ తారీఖున థియేటర్స్ లోకి అడుగుపెట్టబోతుంది. ఊర మాస్ సినిమాలు చెయ్యడంలో బోయపాటి సిద్ధహస్తుడు. గత సంవత్సరం అఖండ మూవీ తో బాక్స్ ఆఫీస్ రికార్డులని తిరగరాసిన బోయపాటి తాజాగా స్కంద మూవీ తో ఇండస్ట్రీ రికార్డులని బద్దలు కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. బోయపాటి పవర్ కి రామ్ పోతినేని ఎనర్జీ తోడవ్వడంతో ప్రేక్షకుల్లో స్కంద మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఆల్రెడీ సినిమా ట్రైలర్ కూడా ఒక రేంజ్ లో ఉంది. రామ్ సరసన శ్రీలీల, సాయి మంజ్రేకర్ లు హీరోయిన్ లుగా చేస్తున్నారు.
అలాగే ఇదే 28 వ తేదీన కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చంద్రముఖి పార్ట్ 2 సినిమా కూడా విడుదల కాబోతుంది. పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్,జ్యోతిక,నయనతార ప్రధాన పాత్రల్లో 2005 వ సంవత్సరం లో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వసూళ్ల పరంగా అప్పట్లో చంద్రముఖి మూవీ ఎన్నో రికార్డులని కూడా క్రియాట్ చేసింది. జ్యోతికను ఆవహించిన చంద్రముఖిని రజనీకాంత్ చంద్రముఖి మూవీలో పోగొడితే ఇప్పుడు చంద్రముఖి పార్ట్ 2 లో చంద్రముఖి మళ్ళీ ఎందుకు వచ్చింది అనే ఆసక్తికరమైన పాయింట్ తో పి.వాసు నే ప్రేక్షులకి చెప్పబోతున్నారు. పార్ట్-1 లో రజనీకాంత్ పోషించిన డాక్టర్ క్యారక్టర్ ని రాఘవ లారెన్స్ పార్ట్ 2 లో పోషించడం తో సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.
అలాగే ఇంకో క్రేజీ ప్రాజెక్టు కూడా 28 న ప్రేక్షుకుల ముందుకు రాబోతుంది. కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో భారతీయ సినిమా ప్రేక్షకులని తన వైపు చూసేలా చేసుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. తాజాగా ఆయన 'ది వ్యాక్సిన్ వార్' అనే సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. వివేక్ అగ్నిహోత్రి ఎంచుకున్న కధలన్నీ ఎంతో డేర్ గా ఉంటాయి. కాశ్మీర్ ఫైల్స్ సినిమానే అందుకు ఒక ఉదాహరణ. తాజాగా ది వ్యాక్సిన్ వార్ మూవీ ప్రపంచాన్నీ కుదిపేసిన కరోనా అప్పటి పరిస్థితుల్ని అలాగే కరోనా కి వ్యాక్సిన్ ని తయారు చేసే ప్రాసెస్ లో డాక్టరు లు ఎదుర్కున్న సంఘటనల ఆధారంగా వివేక్ ఈ వ్యాక్సిన్ వార్ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది.
ఇంక 29 న విభిన్న చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన పెద కాపు పార్ట్ 1 సినిమా కూడా విడుదల కాబోతుంది. విరాట్ కర్ణ ఈ చిత్రం లో హీరోగా పరిచయమవుతున్నాడు. ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ కూడా పెద కాపు సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలనే పెంచింది. వీటి తో పాటు ఇంకొన్ని వెబ్ సిరీస్, చిత్రాలు కుడా 28 ,29 వ తేదీల్లో ఓటిటి ల్లో విడుదలకి ముస్తాబు అవుతున్నాయి. సో సెప్టెంబర్ చివరి వారం సినీ ప్రేక్షకులకి పండుగ అని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



