సూర్య, కార్తీ మధ్య దూరం.. జ్యోతికతో గొడవే కారణమా?
on Sep 25, 2023
సినీ సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే అవుతుంది. ఒక్కోసారి ఏం చేయకపోయినా వారి గురించి గాసిప్స్ వినిపిస్తుంటాయి. అందులో లవ్ ఎఫైర్స్, కుటుంబ కలహాలు ప్రధానంగా నిలుస్తాయి. కోలీవుడ్ స్టార్ సూర్య కుటుంబం కొంతకాలంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. సూర్య తన తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీకి దూరమయ్యాడని.. దానికి కారణం అతని భార్య జ్యోతిక అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలను ఖండించిన కార్తీ.. జ్యోతిక తనకు అమ్మ లాంటిది అంటూ తన మాటలతో కంటతడి పెట్టించాడు.
అంతకముందు సూర్య కుటుంబం మొత్తం చెన్నైలోనే కలిసి ఉండేవారు. కానీ కొంతకాలంగా జ్యోతిక తన పిల్లలతో కలిసి ముంబైలో ఉంటుండగా, సూర్య కూడా షూటింగ్స్ లేకపోతే ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నాడు. దీంతో జ్యోతిక వల్లే ఆ కుటుంబంలో విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. ప్రస్తుతం జ్యోతిక కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించనని చెప్పిన జ్యోతిక, ఆ మాటను పట్టించుకోకుండా వరుసగా సినిమాల్లో నటించడం పట్ల సూర్య తండ్రి శివకుమార్ అసహనంగా ఉన్నాడని.. అదే కుటుంబ గొడవలకు దారి తీసిందని వార్తలు వినిపించాయి. జ్యోతిక పట్టుదలతోనే సూర్య వేరు కాపురానికి ఒప్పుకున్నాడని, ఆ సమయంలో కార్తీ సైతం తన తండ్రి శివకుమార్ కి మద్దతుగా నిలిచాడని అన్నారు. మొత్తానికి సూర్య తన కుటుంబానికి దూరం కావడానికి కారణం జ్యోతిక అని బలంగా వినిపించింది.
సూర్య కుటుంబం గురించి జరుగుతున్న ప్రచారాలకు తాజాగా కార్తీ చెక్ పెట్టాడు. "జ్యోతికను నేను అమ్మగానే చూశాను. ఆమె కూడా మమ్మల్ని తన పిల్లల మాదిరే చూసింది. అమ్మ ఇప్పుడు ముంబైలో ఉండటంతో ఇల్లంతా బోసిపోయింది. కానీ పిల్లల చదువుల కోసమే ముంబై వెళ్లారు. వారి చదువు పూర్తయ్యాక మళ్ళీ అందరం కలిసే ఉంటాం. అప్పటివరకు ప్రతి పండగకు కలుస్తూనే ఉంటాం" అని కార్తీ చెప్పుకొచ్చాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
