థగ్ లైఫ్ ప్లాప్ పై మణిరత్నం సమాధానం వింటే షాక్ అవుతారు
on Jun 23, 2025
యూనివర్సల్ స్టార్ 'కమల్ హాసన్'(Kamal Haasan)లెజండ్రీ డైరెక్టర్'మణిరత్నం'(Maniratnam)కాంబోలో ఈ నెల 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీ 'థగ్ లైఫ్'(Thug Life). శింబు,త్రిష, అభిరామి, ఐశ్వర్య లేక్ష్మి, నాజర్, జోజు జార్జ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రచార చిత్రాలతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కానీ రిలీజ్ అయ్యాక ప్లాప్ టాక్ ని తెచ్చుకొని భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఈ విషయంపై రీసెంట్ గా మణిరత్నం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'థగ్ లైఫ్' కంటే భిన్నంగా కమల్ నుంచి, నా నుంచి నాయకుడు లాంటి మరో క్లాసిక్ ని అభిమానులు, ప్రేక్షకులు ఆశించారు. కానీ మేము ఎక్కువ అంచనా వెయ్యడంతో అనుకోని ఫలితాన్ని అందుకున్నాం. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే. మమ్మల్ని క్షమించండి. ఆ సినిమా కంటే తక్కువ చెయ్యడం మా ఉద్దేశ్యం కాదు. అలాంటి ఆలోచన మాకు ఎప్పుడు లేదని మణిరత్నం చెప్పుకొచ్చాడు. థగ్ లైఫ్ కి కమల్, మణిరత్నం నిర్మాతలుగా వ్యవహరించారు.
మణిరత్నం, కమల్ కాంబోలో 1987 లో వచ్చిన 'నాయకుడు' చాలా పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక మణిరత్నం ప్రస్తుతం తన కొత్త సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. సదరు సినిమా ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో తెరకెక్కబోతుందనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన పనులని కూడా మణిరత్నం ప్రారంభించాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
